Telangana లో 10th class results గత నెల 30న విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా టెన్ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక ఇప్పుడు విద్యార్థుల దృష్టంతా పై చదువులపైనే. Which course to join ? ఏ కోర్సులు భవిష్యత్తుకు మంచివి? ఉపాధి అవకాశాలు త్వరగా పొందేందుకు అందుబాటులో ఉన్న కోర్సులపై ఆరా తీస్తున్నారు. ఇంటర్మీడియట్లో చేరాలా? లేక Polytechnic, Vocational, IIIT. ఎంచుకుంటారా అనే సందేహంలో ఉన్నారు. మీరు ఇంటర్లో చేరాలనుకుంటే ఇది మంచి అవకాశం. రూ.లక్ష ఫీజు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే model schools లో Inter admissions notification విడుదలైంది
ఇంటర్ విద్యను అందించడానికి government మరియు private colleges ఉన్నాయి. private colleges వేలకు, లక్షల్లో ఫీజులు కట్టాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ కళాశాలల్లో పైసా ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయవచ్చు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 194 model schools లో inter admissions కోసం పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
Intermediate లో చేరాలనుకునే 10వ తరగతి విద్యార్థులు వెంటనే model school లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. May 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు May 31 వరకు అవకాశం కల్పించారు.10వ తరగతిలో జీపీఏ ఆధారంగా ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పిస్తారు. MPC, BIPC, MEC and CEC courses ల్లో ఒక్కొక్కటి 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. ఈ నాలుగు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో బోధించనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు పూర్తి సమాచారం కోసం www.tsmodelschools.com website ను తనిఖీ చేయవచ్చు.