AP TET Results 2024: AP TET ఫలితాలు వస్తున్నాయి.. తాజా అప్డేట్ ప్రకారం..

AP TET Results 2024: Andhra Pradesh State Teacher Eligibility Test (AP TET 2024) ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. AP TET 2024 ప్రతిస్పందన షీట్లు మరియు ఫైనల్ కీ ఇప్పటికే విడుదలయ్యాయి. AP TET exams February 27న ప్రారంభమై March 9న ముగిశాయిAndhra Pradesh TET results త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మునుపటి షెడ్యూల్ ప్రకారం, AP TET ఫలితాలు 2024 March 14న విడుదల కావాల్సి ఉంది. కానీ APలో election code అమలుతో, ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. కానీ పెండింగ్లో ఉన్న AP TET ఫలితాలు 2024 త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. AP లో May 13న పోలింగ్ జరగనుంది. election code ముగిసిన తర్వాత ఫలితాల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

March నెలలోనే ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ ఈసీకి లేఖ రాసినా ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో ఫలితాల విడుదల నిలిచిపోయింది. పైగా.. DSC exams నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో టెట్ ఫలితాలు, DSC exams వాయిదా వేయాల్సి వచ్చింది. టెట్ ఫైనల్ కీ విషయంలో కూడా అనిశ్చితి నెలకొంది. March 13న అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ చెప్పినా అందుబాటులోకి రాలేదు. అయితే మార్చి 14న విద్యాశాఖ అధికారిక website లో తుది కీలు అందుబాటులోకి వచ్చాయి.

మరోవైపు, AP TET Results 2024 కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలను బట్టి, DSC preparation పై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత AP TET Results లపై ఓ అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది AP TET ఫలితాలు 2024 విడుదలకు మార్గం సుగమం చేస్తుంది. అయితే, AP DSC పరీక్షల నిర్వహణకు సంబంధించి స్పష్టత రాకపోవచ్చు. AP TET Resultsలకు సంబంధించి అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://aptet.apcfss.in/ website ను తనిఖీ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *