స్ప్లెండర్ బైక్ యజమానికి శుభవార్త.. ఆర్టీఓ కీలక నిర్ణయం

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ Hero’s Splendor bikes విపరీతమైన ఆదరణ పొందాయి. నగరాలు, గ్రామాలతో సంబంధం లేకుండా ఈ బైక్లను ఉపయోగిస్తారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ధర తక్కువగా ఉండటంతో ఈ బైక్లను రైతులు, చిరుద్యోగులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు, Splendor bike ఎక్కువ మైలేజీని ఇవ్వడంతో ఈ బైక్ల విక్రయం ఇతర బైక్ల కంటే ఎక్కువ రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో బైక్లు అమ్ముడయ్యాయి. సామాన్యుల బైక్గా పేరుగాంచిన ఈ సొగసైన బైక్ మీ వద్ద ఉందా? అయితే పాత స్ప్లెండర్ బైక్ల యజమానులకు శుభవార్త. ఆర్టీఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం electric vehicles trend కొనసాగుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలు electric vehicles మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెట్రో ధరల కారణంగా వాహనదారులు electric vehicles కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పాత స్ప్లెండర్ బైక్లు ఉన్నవారికి ఆర్టీఓ శుభవార్త అందించారు. ఈ బైక్లను electric variants లుగా మార్చే సదుపాయం కల్పించబడింది. మీరు EVకి మార్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. GogoA1 దీనికి పూర్తి మద్దతును అందిస్తుంది. ఇది అధిక సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్, కంట్రోలర్ యూనిట్ మరియు ఇతర అవసరమైన వైరింగ్ భాగాలను అందిస్తుంది.

పెట్రోల్తో నడిచే స్ప్లెండర్ బైక్లను ఈవీలుగా మార్చిన తర్వాత రోడ్లపై తిరిగేందుకు RTO అనుమతించింది. దీంతో వాహనదారులకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. స్లెండర్ను EVగా మార్చిన తర్వాత, మీరు ఒక్కసారి ఛార్జింగ్తో 151 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దూర ప్రయాణాలకు కూడా ఉపయోగపడుతుంది. అయితే old Splendor ev గా మార్చేందుకు రూ. 35 వేలు ఖర్చవుతుంది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలంటే స్ప్లెండర్ బైక్ ను ఈవీగా మార్చుకుంటే ఆర్థిక భారం తప్పదని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *