ఉద్యోగులు మారుతున్న AI కి టెక్నాలజీ అనుగుణంగా మారకపోతే..

Microsoft-LinkedIn survey లో 92 శాతం మంది AIని ఉపయోగిస్తున్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

artificial intelligence (AI )కి ఉద్యోగులు వేగంగా అలవాటు పడుతున్నారని Microsoft-Linkedin నివేదిక పేర్కొంది.

దేశంలోని 92 శాతం మంది knowledge workers (సమాచారాన్ని నిర్వహించే ఉద్యోగాలు చేసేవారు) AIని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 75 శాతం. ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలోని 91 శాతం మంది నాయకులు (top management in companies ) కంపెనీలు AIకి మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Related News

54 శాతం మంది తమ కంపెనీలకు ఎలాంటి ప్రణాళిక లేదా విజన్ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 31 దేశాల్లోని 31 వేల మంది అభిప్రాయాలను సేకరించి లింక్డ్ ఇన్ ఈ సర్వే నిర్వహించింది. 75 శాతం మంది నియామకంలో AI నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, 66 శాతం మంది నాయకులు నియామకంలో AIకి ప్రాధాన్యత ఇస్తారు.

భారతదేశంలోని 85 శాతం మంది నాయకులు (top management in companies ) తమకు తక్కువ అనుభవం ఉన్నప్పటికీ, AI నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని లింక్డిన్ నివేదిక పేర్కొంది. AI సాధనాలు మరియు శిక్షణను అందించే సంస్థలు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షిస్తున్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *