Smartphone: బీపీకి మొబైల్ కి మధ్య ఉన్న సంబంధం.. పరిశోధనలో సంచలన విషయాలు

ఉదయం పూట మొదట చూసుకుని రాత్రి పడుకునే ముందు చివరిగా చూసేది ఏదైనా ఉందంటే దానికి సమాధానం smartphone . Phone మన జీవితంలో ఒక భాగమైపోయింది. చేతిలో Phone లేకుండా ఒక రోజు గడవదు. ఒకప్పుడు కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించే గాడ్జెట్ ఇప్పుడు అన్నింటికీ ఆధారం అయ్యింది. కానీ మన జీవితాలను చాలా సింపుల్గా మార్చిన Phone మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Phone వాడకం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఓ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఎక్కువ సేపు Mobile Phone లో మాట్లాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం Phone మాట్లాడే వారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

ఈ వివరాలను European Heart Journal – Digital Health ప్రచురించారు. Mobile Phone నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలకు కారణమవుతుందని చైనాలోని గ్వాంగ్జౌలోని Southern Medical University పరిశోధకులు కనుగొన్నారు. ఈ కారణంగానే అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశంలో 120 కోట్ల మందికి పైగా Mobile Phone వాడుతుంటే.. 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది BP బారిన పడుతుండగా, వారిలో 82 శాతం మంది అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లోనే జీవిస్తున్నారని పేర్కొంది.

అధిక BP వల్ల heart attacks , అకాల మరణాలు సంభవిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల కంటే ఎక్కువసేపు Mobile లో మాట్లాడేవారిలో ఇతరులతో పోలిస్తే hypertension వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. మరియు వారానికి ఆరు గంటలకు మించి Phone మాట్లాడేవారిలో రక్తపోటు ముప్పు 25 శాతానికి పెరిగింది. అందుకే వీలైనంత వరకు Phone లో మాట్లాడాలని సూచించారు. లేదంటే Phone పెట్టేసి speaker లో మాట్లాడేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *