జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి
జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలి. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు/ డివిజన్, వార్డు అధ్యక్షులు / క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు/ ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్ళీ పెన్షన్లు పంపిణీ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే/ఎంపీ/ ఇన్‌చార్జ్/ పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి (టెస్ట్ మోనియల్స్) సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలి.
ఇట్లు,
టీడీపీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి.