ఆర్ అండ్ బి రోడ్డుపై గ్రావెల్ మట్టి పోసి రోడ్లను నాశనం చేస్తున్నారా..? ఈ మట్టి పోయకపోతే రోడ్లు బాగుండేవి అని అక్కడ ప్రజలు అంటున్నారు . బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామం ఆర్ అండ్ బి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా గ్రావెల్ పోయడానికి పర్మిషన్ ఇచ్చారా లేక కావాలని చేస్తున్న కార్యకలాపాలాయి.? ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఆర్ అండ్ బి రోడ్లపై ఈ విధంగా గ్రావిల్ లాంటివి మట్టి పోసి రోడ్లను నాశనం చేస్తుంటే అధికారులు పట్టించుకోరా? గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నే ఈ గ్రావెల్ పోశారని అక్కడ చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు. గ్రామ ప్రజలు అటుగా వెళ్లే వాహనాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.! దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియజేస్తాము. ఈ సంఘటనపై ఆర్ అండ్ బి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి