పిఠాపురం వర్మకు బాబు షాక్
పిఠాపురం: విబి న్యూస్ డిజిటల్ మీడియా
APలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూటమి ఖరారు చేసింది.
టీడీపీ నుంచి సి. రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌కు అవకాశం కల్పించారు. వీరిద్దరూ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం వీరిద్దరూ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అయితే..
పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో కష్టపడిన వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అందరూ భావించారు.
కానీ ఊహించని విధంగా వర్మని కాదని సి. రామచంద్రయ్యకు అవకాశం ఇవ్వటంతో వర్మ అభిమానులు షాక్‌కు గురయ్యారు.