ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఇకపై టన్ను ఇసుకపై రూ.287 మిగులుసీనరేజ్ కింద రూ.88 మాత్రమే వసూలు…
ఆ మొత్తమూ స్థానిక సంస్థల ఖాతాలకే
అమరావతి: వి బి న్యూస్ డిజిటల్ మీడియా
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు.ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను రూ.475 చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు రూ.100 తీసేయగా, మిగిలిన రూ.375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై రూ.375 కాకుండా.. కేవలం రూ.88 వసూలు చేస్తారు. ఆ మొత్తమూ స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో.. సీనరేజ్ ఛార్జి కింద తీసుకునే రూ.66(టన్నుకు) నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద రూ.19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూ.1.32 గనులశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు రూ.287 భారం తగ్గుతుంది.