నవభారత నిర్మాణ సారధి – డాక్టర్. బాబు జగజీవన్ రామ్:
సమాజంలో ఎందరో జన్మిస్తున్నారు మరియు గతిస్తూనే ఉన్నారు. కాని, కొందరు మాత్రమే, కార్యం కోసం జన్మించి, ఆ కార్యాన్ని పూర్తి చేసి, బౌతికంగా ఈ లోకానికి దూరమై, ప్రజల హృదయాలలో నిత్యమూ జీవించే ఉంటారు. వారినే కారణ జన్ములు అంటారు. ఆ కోవకు చెందిన మహానుభావుడే, భరతమాత ముద్దుబిడ్డ, నవ భారత నిర్మాణ సారధి, డాక్టర్ బాబు జగజీవన రామ్. ఆది జాంబవ వంశంలో, జాంబవ అంశతో జన్మించి, సర్వజనులను సమాన దృష్టితో చూసిన, బ్రహ్మజ్ఞాని. పరిపాలనలో దిట్ట, సుక్షత్రియ చక్రవర్తి బాబుజీ.
స్వాతంత్య్ర భారతదేశ మొదటి కార్మికశాఖ మంత్రిగా, కార్మికుల కోసం, ఎన్నో రకాల భద్రతా సౌకర్యాలు కల్పించి, ఉద్యోగులను ప్రభుత్వ బిడ్డలుగా చూసుకున్న గొప్ప మానవతా మూర్తి బాబుజి.
తపాలాశాఖ మంత్రిగా అప్పటివరకు నలభై వేలు గా ఉన్న పోస్ట్ ఆఫీస్ లను 2,20,000 పైగా పెంచి, ప్రతి ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ మరియు తపాలా ఉద్యోగి నియమించి. తపాలా ఉద్యోగికి సైకిల్, యూనిఫామ్ మరియు గొడుగు సౌకర్యం కలిపించిన మహనీయ మంత్రి బాబుజి.
విమానయానశాఖ మంత్రిగా, 18 ప్రైవేట్ విమాన సంస్థలను, ఒక్క సంతకంతో, ఎయిర్ ఇండియాగా జాతీయ కరణం చేసిన, గొప్ప సామజిక సామ్యవాది బాబుజి.
రైల్వే శాఖ మంత్రిగా, గిరిజనులు అనబడేవారు, గిరికే పరిమితం కాకుండా, అడవులలో దొరికే ఉత్పత్తులను, రైల్ ప్రయాణికులకు అమ్ముకునే విధముగా, వారికి ఉచిత పాస్ లు ఇచ్చి, సభ్యసమాజంలో కలిసిపోయే విధముగా సహరించటం జరిగింది. అదే విధముగా, రైల్వే సంస్థలలో గిరిజనులకే కాంటీన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. రిజర్వేషన్స్ చక్కగా అమలు కావాలంటే, నియామక కమిటీ లలో ఆయావర్గాల ప్రతినిధులు ఉండేలాగా చేసిన, గొప్ప సామజిక విప్లవ వాది బాబుజి.
వ్యవసాయ శాఖ మంత్రిగా, హరిత విప్లవానికి నాంది పలికిన పితామహుడు. శాస్త్రవేత్తలతో, మీ పరిశోధన ఫలితాలు, రైతులకు మార్గదర్శికంగా ఉండాలని, నిర్దేశించిన గొప్ప పరిపాలనా శాస్త్రవేత్త. దేశంలో కొన్ని ప్రాంతా లలోనే పంట పండేది. అక్కడ రైతుల నుండి పంటను ప్రభుత్వమే సేకరించి, గోదాములలో దాచిపెట్టి (Food Corporation of India), ఆహారం కోసం అలమటిస్తుండే ప్రాంతాలలో ప్రజా పంపిణి వ్యవస్థ (Ration shop) ద్వారా, కుటుంబానికి సరిపడు ఆహార పదార్థాలను, తక్కువ రేటుకు ప్రభుత్వమే పంపిణి చేసేవారు. ఆ విధముగా ప్రజలను కరువు కాటకాల నుండి కాపాడిన అన్నదాత మన బాబుజి.
పునరావాస శాఖ మంత్రిగా రాజుల మాన్యాలు, రాజభరణాలు రద్దుచేయించి, భూమి లేని పేదలకు భూములు పంచిపెట్టిన భూదాత మన బాబుజి. ఆ భూములకు వ్యవసాయ అవసరాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వ టానికి ముందుకు రాకపోతే, బ్యాంకులను జాతీయం చేయించి, రైతులకు రుణాలు ఇప్పించిన, ధీశాలి బాబుజి.
రక్షణ మంత్రిగా భారతదేశం ఎల్లవేళలా గొప్పగా చెప్పుకునే విజయం, పాకిస్తాన్ తో యుద్ధం.
అంబెడ్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసిన ఘనుడు బాబుజి.
దామోదర్ సంజీవయ్య ను ముఖ్యమంత్రిని చేసిన మొనగాడు బాబుజి.
కాకాగా ప్రచారం చేసుకునే వెంకటస్వామికి రాజకీయ బిక్ష పెట్టిన గొప్ప నేత మన బాబుజి. కనీసం కాకా కుమారులైన, బాబుజి గురించి చెప్పకపోవటం, వారి విగ్నితకే వదిలేద్దాం.
SC/ST వర్గాల ప్రజల రక్షణ కవచముగా Prevention of Atrocities Act అందించిన మహా మేధావి డాక్టర్
బాబు జగజీవన్ రామ్, మరి ఆయా వర్గాల ప్రజలు బాబుజి ని గౌరవిస్తున్నారా ?
మతాలు మారితే రిజర్వేషన్స్ పొందలేరు, కనుక జన్మతః, ఈ దేశంలో పుట్టిన, నా ప్రజలు, సనాతన ధర్మానికి వారసులు, పిరికి వాళ్ళలాగా విదేశీ మతాలు ఆచరించవద్దు అని మార్గదర్శకం చేసిన గొప్ప గురువు బాబుజి.
జై జాంబవ జై జై జాంబవ