పంచాయతీరాజ్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి : ఎమ్మెల్యే వెంకట్రావ్
గన్నవరం : వి బి న్యూస్ డిజిటల్ మీడియా
పంచాయతీరాజ్ విభాగంలోని పెండింగ్ పనులపై దృష్టిసారించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి గన్నవరం నియోజకవర్గ పంచాయతీరాజ్ అధికారులతో అయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా వెంకట్రావ్ మాట్లాడుతూ నియిజకవర్గంలో ని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసం అయ్యాయిని వాటికి తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో అంతర్గత రహదారులు సీసీ రోడ్లగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ సూచించారు. వర్షకాలం ప్రారంభం కావటంతో డ్రైనేజి వ్యవస్థను మెరుగుర్చాలన్నారు. పెండింగ్ పనులపై ఆరా తీశారు. ప్రాధాన్యతా పరంగా పనులు గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. బాపులపాడు మండలం రంగయ్య అప్పారావు పేట గ్రామానికి వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించాలని అధికారులకు వెంకట్రావ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం డి.ఈ పి. సురేష్, పి. ఐ. యూ డి.ఈ భవాని, ఏ.ఈ లు డి.జయరాజు, సి.హెచ్.దాసు తదితరులు పాల్గొన్నారు.