వర్షాలు.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయనగరం, కాకినాడ, అల్లూరి, శ్రీకాకుళం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు(ఈ రోజు) శనివారం సెలవు ప్రకటించారు.