కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కె.సీతారామపురం గ్రామంలోని వివిధ సమస్యలు పై గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నుబోయిన వెంకట మహాలక్ష్మి యమ్ పి టి సి చెన్నుబోయిన వెంకటేశ్వరమ్మ వైస్ ప్రెసిడెంట్ బొకినాల బాబు మాజీ ఏం.పి.టి.సి చెన్నుబోయిన శివయ్య వీరి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారి సీనియర్ అసిస్టెంట్ దమయింతి వారికి మెమోరండం ఇవ్వటంజరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ చెన్నుబోయిన వెంకట మహాలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎక్కువ జనాభా గల మా గ్రామం శేరీనరసన్నపాలెం కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటు చేసి కె.సీతారామపురం సచివాలయంగా మా గ్రామంలోనే విధులు నిర్వహించారు. రాజకీయ ఒత్తిడి వల్లన ఈ సచివాలయంను శేరీ నరసన్నపాలెంలోకి మార్చి అక్కడనే విధులు నిర్వహిస్తున్నారు మాసచివాలయం మాకు సెపరేట్ గా చేయించవలసినదిగా అప్పటి వరకు మా పంచాయతీ కార్యాలయంలో వారంనకు మూడు రోజులు విధులు నిర్వహించే లాగున ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మా గ్రామం మైనరు పంచాయతీ అవటం పంచాయతీకి ఆధాయ వనరులు లేకపోవటం వలన అభివృద్ధి కి విఘాతం కలుగుతుందని రోడ్లు, మంచినీరు డ్రైనేజి శానిటరీ ఇంజనీరింగు వర్క్స్కి సొంత నిధులు నుండి ఖర్చుచేసి, ఇబ్బందిపాలైనాను. అకాలవర్షాలు పడటం వలన రోడ్లు పై మోకాళ్ళ లోతు నీరు వచ్చి ఈగలు దోమలు చేరి మా గ్రామస్తులు రోగాన బారిన పడుతున్నారు. కావున త్వరితగతిన నిధులు మంజూరు చేయాలనికోరారు.
ఈసంధర్బంగా గ్రామస్తులు చెన్నుబోయిన నాగరాజు, అచ్చిన వెంకటేశ్వరరావు, చెన్నుబోయిన ఉమామహేశ్వరరావు, బూర్లు శ్రీనివాసరావు, పానె శ్రీమన్నారాయణ ,ఎనికేపల్లి రాఘవులు, చౌడాడ పెద్దిరాజు, తట్టిజయరాజు తదితరులు పాల్గొన్నారు