27/07/2024
అమ్మ పేరుతో మొక్క నాటుదాం
హనుమాన్ జంక్షన్ సిద్ధార్థ విద్యాలయ స్కూల్లో ‘అమ్మ పేరుతో మొక్క నాటుదాం’ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విదానంలో భాగంగా ఈ రోజు శనివారం సాయంత్రం 3 గం॥ లకు మండల విద్యాధికారి బట్టు సురేష్ గారి ఆధ్వర్యంలో ‘అమ్మ పేరుతో మొక్క నాటుదాం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 కు పైగా మొక్కలను పిల్లలు వారి తల్లి తండ్రుల సమక్షంలో నాటించడం జరిగినదని స్కూల్ ప్రదానోపాద్యాయురాలు శ్రీమతి వీరమాచినేని ధనలక్ష్మి గారు తెలియజేశారు. ఈ కారాయక్రమంలో మండల విద్యాదికారిమాట్లాడుతూ భూమి పై మొక్కలు చాలా అవసరం, మొక్కలు పెంపకం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు. మరియు ఆక్సిజన్ పెంపొందించటం, సకాలంలో వర్షాలు రావడానికి సహకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు అక్కినేనీ రాఘవేంద్రరావు గారు మొక్కలు పెంపకం ద్వారా భూమిని పరిరక్షించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.