చెలరేగిపోతున్న రేషన్ బియ్యం దందా….!

చెలరేగిపోతున్న రేషన్ బియ్యం దందా….!
ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతున్నది…!!
మండలంలో యథేచ్ఛగా రీసైక్లింగ్‌ దందా కొనసాగుతున్నది….!!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పిడిఎఫ్ రైస్ దందా చేస్తున్న అక్రమార్కులు సిండికేట్ గా వ్యాపారం….!!

బాపులపాడు మండలం : వి బి న్యూస్ డిజిటల్ మీడియా

ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతున్నది. యథేచ్ఛగా అక్రమ దారులు రాత్రుల్లో అధికారులను నిద్రపుచ్చి సాఫీగా తమ వ్యాపారాన్ని ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అలాగే మిల్లుల్లో పీడీఎస్‌ రైస్‌ను రీసైక్లింగ్ చేస్తూ సన్నబియ్యంగా మార్చుతూ అక్రమార్కులు లక్షలకు పడుగలెత్తుతున్నారు. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా సాగడానికి అధికారులకు కొద్ది మొత్తంలో ముడుపులు ముట్ట చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మండలంలో రేషన్ బియ్యం అక్రమ దారులు ఓ సిండికేట్ గా ఏర్పడి చుట్టుపక్కల గ్రామాల్లోని రేషన్‌ లబ్ధిదారుల నుండి తక్కువ రేటుకు రేషన్ బియ్యం దందా వ్యవహరిస్తూ వ్యాపారం సాగిస్తున్నారని సమాచారం… సబ్సిడీ రేషన్‌ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్న సివిల్ సప్లై అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం మండలంలో సర్వత్ర విమర్శలు వినబడుతున్నాయి . కొన్ని రైస్‌మిల్లుల్లో రీసైక్లింగ్ దందా నడుస్తున్నప్పటికీ, సంబంధిత శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *