చేపల చెరువుల్లో కోళ్ళ వ్యర్ధాలు వాడితే కఠిన చర్యలు
మత్స్య శాఖ సమీక్ష లో యంపి పుట్టా మహేష్ కుమార్ హెచ్చరిక
ఏలూరు, ఆగష్టు 26, వి బి న్యూస్ డిజిటల్ మీడియా
జిల్లాలో చేపల చెరువుల్లో కోళ్ళ వ్యర్ధాలు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని యంపి పుట్టా మహేష్ కుమార్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లకు తగు ఆదేశాలు ఇస్తామన్నారు. ఏలూరు లోని మత్స్య శాఖ కార్యాలయం లో జరిగిన సమీక్షా సమావేశం లో యంపి మాట్లాడుతూ కొల్లేరు/గోదావరి చేపలకు జాతీయ స్థాయి లో మంచి మార్కెట్ ఉందని, కానీ ఇటీవల కాలంలో ఢిల్లీ లో జరిగిన పలు సమావేశాల్లో కొల్లేరు చేపల పెంపకందార్లు కోళ్ళ వ్యర్ధాలు వాడుతున్నారని అందువలన ఆరోగ్యం పాడైపోతుందనే అందోళన వ్యక్తమైందన్నారు.
కొల్లేరు బ్రాండ్ ఇమేజ్ ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. మత్స్యశాఖ సమీక్షా సమావేశం లో డిప్యూటీ డైరెక్టర్ నాగలింగాచారి అసిస్టెంట్ డైరెక్టర్ (బాదంపూడి)నరసయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏలూరు)రాజకుమార్, మత్స్య శాఖ అభివృద్ది అధికారి దివ్య పాల్గొన్నారు.