ఇంటెన్షఫైడ్ వారికీ స్టాఫ్ నర్స్ ల ఉద్యోగాలు ఇస్తే నిరహార దీక్షలు చేస్తాం..
ఉంగుటూరు : సెప్టెంబర్ 10, వి బి న్యూస్ డిజిటల్ మీడియా
ఏఎన్ఎం టూ జిఎన్ఎమ్ ఇంటెన్షఫైడ్ వారికీ స్టాఫ్ నర్స్ ల ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపడతామని ఆంధ్ర ప్రదేశ్ నర్సుల పోరాట కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సౌమ్యరేఖ బొకినాలా ఓ ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వం సర్వీస్ లో ఉన్న ANM లకు ఇంటెన్సిఫైడ్ GNM పేరుతో నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పి 18 నెలలపాటు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనివల్ల నర్సింగ్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ గతంలోనే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించడం కూడా జరిగింది.
అంతేకాకుండా గౌరవ హైకోర్టు నందు నర్సింగ్ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ పిటిషన్ దాఖలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటెన్సిఫైడ్ వారికి కేవలం నైపుణ్య శిక్షణ మాత్రమే ఇస్తున్నామని వారికి స్టాప్ నర్స్ ల ఉద్యోగాలు ఇవ్వడం లేదని తప్పుడు సమాచారం కూడా అందించారు.
ప్రస్తుతం జీవో నెంబర్ 115 విడుదల చేసి ఇంటెన్సిఫైడ్ శిక్షణ తీసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ల ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అత్యవసర విధులు కొనసాగిస్తూ దశలవారీ నిరసనకు పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు.
అందులో భాగంగా 07/09/2024 నుండి 09/09/2014 వరకు అత్యవసర విధులు మినహాయించి ఒక గంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలిపాము అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుండి జీవో నెంబర్ 115 రద్దు పై ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలిపారు.
వారి ప్రధాన డిమాండ్స్ :
1.జీ ఓ నెం 115 ని రద్దు చెయ్యాలి
2. కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి
నిరసన కార్యక్రమ సమాచారం :
10/09/2024 నుండి 12/09/2024 వరకు విధులు కొనసాగిస్తూనే డ్యూటీ లో లేనివారితో రిలేదిక్షలు
13/09/2024 నుండి 16/09/2024 వరకు అత్యవసర విధులు మినహాయించి ఓపి విధులు, సాధారణ వార్డ్ విధులు బహిష్కరణ చేసి రిలే దీక్షలలో పాల్గొనడం
17/09/2024 సాధారణ విధులతో పాటు అత్యవసర విధుల 2 గంటల పాటు బహిష్కరణ
18/09/2024 రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ విధులతో పాటు అత్యవసర విధులు కూడా బహిష్కరణ చేసి నిరవధిక దీక్షలలో పాల్గొనడం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జివో నెం : 115 ని రద్దు చెయ్యాలి లేని పక్షం లో భవిష్యత్తు లో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.