వరద బాధితులకు ఏ. పి. యు.డబ్ల్యూ.జె భోజనం ఏర్పాటు
హనుమాన్ జంక్షన్ : సెప్టెంబర్ 10 వి బి న్యూస్ డిజిటల్ మీడియా
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగయ్యప్పారావుపేట గ్రామంలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏ.పి. యు.డబ్ల్యూ.జె) ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆదేశాల మేరకు గ్రామంలోని వరద బాధితులకు గత ఎనిమిది రోజులుగా దాతల సహకారంతో భోజనం అందిస్తున్నారు. ఏ.పి. యు.డబ్ల్యూ.జె జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ స్వంత నిధులతో గ్రామంలోని 200మంది వరద బాధితులకు మంగళవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. ఈ సందర్బంగా రంగయ్య అప్పారావుపేట గ్రామం లో బాధితులకు యూనియన్ సభ్యులతో కలిసి భోజనాన్ని వడ్డించిన సర్పంచ్ కాకొల్లు అన్నామణి మాట్లాడుతూ జర్నలిస్ట్ లు సమాజసేవలో పలు పంచుకోవటం అభినందనీయమన్నారు. తమ గ్రామం లోని బాధితులకు ఆహారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ గారి స్పూర్తితో, వరద బాధితులకు మనవంతు సాయం చేయాలనే తలంపుతో ఈ గ్రామంలో బాధితుల కు ఆహారం అందించినట్లు చెప్పారు. సేవా కార్యక్రమాల్లో ఏ.పి. యు.డబ్ల్యూ.జె ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు అట్లూరి రాజశేఖర్, ధనియాల అప్పారావు, గోవాడ సునీల్ కుమార్, అక్కినేని శ్రీనివాస ఫణింద్ర, పల్లపు అంకమ్మ బాబు, రామకృష్ణ, పరుచూరి రామకృష్ణ, ఉప సర్పంచ్ మళ్లీ బోయిన శ్రీనివాసరావు, లింగం శ్రీధర్, ధోనె అశోక్, కొల్లిపర శ్రీనివాస్, కొమ్మినేని శివ, కాకొల్లు శేఖర్, కాకులుపాడు విఆర్ఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు