మన మంచి ప్రభుత్వం 100 రోజుల పాలన వివరిస్తున్న ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాండ్రు అజయ్

గన్నవరం నియోజకవర్గం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బాపులపాడు , సెప్టెంబర్ : 20  వి బి న్యూస్ డిజిటల్ మీడియా

గన్నవరం నియోజకవర్గం, కె.సీతారమపురం గ్రామలో ప్రజల మంచిని ఆకాంక్షించి ప్రజా ఆశీస్సులతో అఖండ విజయం సాధించిన కూటమి  ప్రభుత్వం ఏర్పరచి 100 రోజుల్లోనే ప్రధానమైనటువంటి హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు…

మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన తెలుగుదేశం పార్టి గన్నవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాండ్రు అజయ్ కుమార్ గ్రామ పార్టీ నాయకులు తెలుగు యువత ఇంటి ఇంటికి వెళ్లి 100 రోజుల పాలన వివరించిన నాయకులు

అవ్వతాతల పెన్షన్లను 4 వేలకు పెంచుతానని ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో బకాయిలతో కలిపి మొత్తం పింఛను ఇస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చి అవ్వ తాతల రుణాన్ని తీర్చుకున్నాడు అన్నారు…

అదే సందర్భంలో ప్రజల ఆస్తి హక్కును సైతం ప్రశ్నార్థకం చేసిన జగన్ రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తుల రక్షణకు చంద్రన్న చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలుసన్నారు…

ప్రజల కష్టాలలో ఆప్తుడిలా ఎలా చంద్రన్న నిలబడగలడో గతంలో హుదూద్ తుఫాన్ లోను మొన్న విజయవాడ వరదల్లోనూ ప్రజల రక్షణకు చేసిన చర్యలు కళ్ళకు కట్టేలా చూపాయన్నారు…

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలుపరిచిన అన్న క్యాంటీన్లను గత వైసిపి ప్రభుత్వం రద్దు చేయగా నేడు చంద్రన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాటిని తిరిగి తెరచి పేదలకు ఐదు రూపాయలకే అన్నాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాడు అన్నారు…

పేదలకు పట్టెడన్నం పెట్టలేని జగన్ రెడ్డి,గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లతో ఎటువంటి చెత్త పనులు చేసిందో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే నమ్మశక్యం కాని పరిస్థితి ఎదుర్వుతోందని చివరికి దైవ సేవలోనూ నాసిరకపు ఆహార పదార్థాలను వినియోగించారంటే చివరికి జగన్ కు దేవుడంటే కూడా భయం లేదని అర్థమవుతుందన్నారు…

ఈ కార్యక్రమంలో సచివాలయం డిజిటల్ ఫీల్డ్ అసిస్టెంట్ శివనాగరాజు పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ పార్టీ నాయకులు పల్లిపాముల రత్నం, సోదిమెల్ల రాజశేఖర్, ఉపులూరి జయరాజు, చేన్నుబోయిన సాంబశివరావు, మాయర శ్రీనివాస్ రావు, బళ్ల జగదీష్,  సోదిమెళ్ళ భాగ్య రావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *