చెకుముకి సైన్ సంబరాలు 2024 పోస్టర్ ఆవిష్కరణ
బాపులపాడు సెప్టెంబర్: 24 వి బి న్యూస్ డిజిటల్ మీడియా
జన విజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక దోహదపడిందని బాపులపాడు మండల జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు వీరమాచినేని సత్య ప్రసాద్ అన్నారు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం జన విజ్ఞాన వేదిక నిర్వహించిన ఓ కార్యక్రమం లో సంబరాలు వలన విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుందని, శాస్త్ర విజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత తెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెకుముకి పత్రికను చదువుకోవాలని అధ్యక్షులు విడిఎస్ ప్రసాద్ అన్నారు మండల ప్రధాన కార్యదర్శి దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ ఈనెల 25న పాఠశాల స్థాయి, మండల స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల 8 9 10 తరగతిలో ఒక జట్టుగా ఏర్పడి పాఠశాల స్థాయిలో పాల్గొనాలని ఇప్పటికే ప్రశ్నాపత్రాలు వివిధ పాఠశాలకు అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెలమర్తి రవిబాబు, ఇటీఎఫ్ మండల కార్యదర్శి దొనే శ్రీహరి, మానవత సభ్యులు దయాల ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు ఎమ్మెస్సార్ ప్రసాద్, పూర్ణ చంద్ర ఆచార్యులు, జి గోవర్ధన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు