సిటీలో ఎయిర్ ట్యాక్సీలు… గాల్లో ఎగరనున్న హైదరాబాదీలు…

దేశంలో ట్రాఫిక్ పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా, వాహనదారుల సంఖ్య పెరగడం వల్ల నగర రోడ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఆఫీసులకు త్వరగా చేరుకోవడం కష్టం. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసి పరీక్షిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దేశంలోని ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కాగా, హైదరాబాద్‌కు చెందిన ‘డ్రోగో డ్రోన్స్’ అనే డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్‌లో ఎయిర్ ట్యాక్సీలను నడిపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత సాంకేతిక పనులు జరుగుతున్నాయని డ్రోగో డ్రోన్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ దన్నపనేని వెల్లడించారు. కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ ప్రాజెక్టుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎయిర్ ట్యాక్సీల్లో ప్రయాణిస్తామన్నారు. ఆటోలు, క్యాబ్‌లు ఎక్కగలిగితే ఈ డ్రోన్ ట్యాక్సీలు ఎక్కి ప్రయాణించవచ్చని తెలిపారు. అలాగే నగరంలో అత్యవసర సేవల కోసం ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తామని సీఈవో యశ్వంత్ తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కృషి 3 డ్రోన్‌కు డీజీసీఏ అనుమతి కూడా లభించిందని తెలిపారు.

ఈ కంపెనీ ఇప్పటికే అగ్రి డ్రోన్లపై దృష్టి సారించిందని.. తమ కంపెనీ డ్రోన్లతో వ్యవసాయ రంగానికి సేవలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కేరళ, కర్నాటక సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 30 లక్షల ఎకరాల్లో పంటలపై పురుగుమందులు పిచికారీ చేసేందుకు డ్రోన్‌లను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో మరింత ప్రభావవంతమైన సేవలు అందించేందుకు కృషి 3 డ్రోన్‌లకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుంచి అనుమతి కూడా లభించిందని సీఈవో యశ్వంత్‌ తెలిపారు. ఒకసారి ఛార్జ్ చేస్తే, ఈ డ్రోన్ 4 ఎకరాలలో పురుగుమందులను పిచికారీ చేయగలదు. ఫుల్ ఛార్జ్‌లో ఉండే ఈ డ్రోన్ 24 నిమిషాల పాటు గాలిలో ఉండగలదని ఆయన తెలిపారు.

Related News

హైదరాబాద్ డ్రోన్ టెక్ కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మరోవైపు ఈ ఎయిర్ ట్యాక్సీలను ఎయిర్ అంబులెన్స్‌ల కింద ఉపయోగిస్తే ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పేషెంట్‌ని త్వరగా ఆస్పత్రికి తరలించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఎయిర్ ట్యాక్సీలను ఎయిర్ అంబులెన్స్‌లుగా ఉపయోగించేందుకు ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుంటే, ప్రమాద బాధితులను నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి తరలించవచ్చు. మరి దీని గురించి మీరేమంటారు?

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *