AP Polycet 2024 Counselling: ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల..

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • May 27 నుంచి జూన్ 3 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.
  • May 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు.
  • May 5వ తేదీలోనే ఆప్షన్‌లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
  • May 7న సీట్లు కేటాయిస్తారు.
  • May 10 నుంచి 14 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
  • సీటు వచ్చిన కాలేజీల్లో స్వయంగా లేదా ఆన్‌లైన్ విధానంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఈ ఏడాది పాలీసెట్ ఫలితాలు మే 8న విడుదల కాగా.. ఫలితాల్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వారిలో 50,710 మంది (89.81 శాతం) బాలికలు, 73,720 మంది (73.72 శాతం) బాలురు ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది పాలీసెట్ ఉత్తీర్ణత 87.61 శాతం. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలీసెట్‌లో ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ, ఇతర అంశాల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు.

ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 267 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *