ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన ఓ బాలిక పై జరిగిన సంఘటన పట్ల రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఈ సంఘటనకి పాల్పడిన వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైతే జాగిలాలను దింపి తక్షణం నిందితులను పట్టుకోవాలని మంత్రి ఆదేశించారు. సంఘటన జరిగిన విషయాన్ని తెసులుకొన్న వెంటనే అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించాలని మంత్రి ఏలూరు జిల్లా కలెక్టర్, ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. బాలికకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి 11, 12 గం.ల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తల్లిదండ్రుల మధ్యలో పడుకున్న నాలుగు సంవత్సరాల పాపను రేప్ చేసి పామాయిల్ తోటలో వదిలేయడం జరిగింది. గ్రామంలోని ఒక పెద్దాయన రాత్రి రెండు గంటల సమయంలో పాపను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్పి పోలీసులు సమాచారం ఇచ్చి నూజివీడు హాస్పిటల్ కు తరలించడం జరిగింది.అక్కడ నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేసారు.
ఏలూరు జిల్లా లో నాలుగు సంవత్సరాల పాపను రేప్ చేసి పామాయిల్ తోటలో వదిలేసిన కామాంధుడు
05
Aug