హనుమాన్ జంక్షన్: సెప్టెంబర్ 10 వి బి న్యూస్ డిజిటల్ మీడియా
బుడమేరు ముంపుకు గురైన కృష్ణ జిల్లా బాపులపాడు మండలం ఓగిరాల, రంగయ్య అప్పారావు పేట రామన్నగూడెం చుట్టు పక్కల గ్రామాల్లోని వరద బాధితులకు బాపులపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ శిభిరం లో 300 మందికి ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఈ శిభిరంలో ఉన్న బాధితులకు ఆరుగొలను గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త కొల్లి వెంకట ధనుంజయ బోజన ఏర్పాట్లు చేశారు. ఉదయం టిఫిన్ దగ్గర నుండి మధ్యాహ్నం భోజనం వరకు సాయంత్రం స్నాక్స్ దగ్గర నుండి రాత్రి భోజనం తో పాటు రెండుసార్లు టీ ఏర్పాటు కూడా చేశారు. వరద బాధితుల్లా కాకుండా ప్రేమతో వారికి విందు భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ జెడ్ పి టి సి సభ్యులు సుంకర సుభాష్ చంద్రబోస్, బాపులపాడు ఉప సర్పంచ్ దుట్టా శివన్నారాయణ, స్రవంతి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్య ప్రసాద్, టౌన్ పార్టీ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాస్ , సెక్రెటరీ గార్లపాటి రాజేశ్వరరావు, లయన్స్ గ్లోబల్ ప్రెసిడెంట్ తాడి రంగారావు, జిల్లా పరిషత్
హైస్కూల్ హెచ్ ఎం టి.వి నాగేశ్వరరావు , ఆర్య వైశ్య సంఘం నాయకులు పైడి సుధాకర్ , తవ్వా కుటుంబరావు, వి ఆర్ ఓ ఆర్నేపల్లి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
వరద బాధితులకు విందు భోజనాలు ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్త
10
Sep