రేమల్లె సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

బాపులపాడు నవంబర్: 24 వి బి న్యూస్ డిజిటల్ మీడియా

రాష్ట్రసాంఘీక శాస్త్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా దారపురెడ్డి భాస్కరరావు ఎంపిక అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ స్టడీస్ టీచర్స్ పోరం తరుపున 2024వ సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు గ్రహీతగా దారపురెడ్డి భాస్కరరావు ఎంపిక చేసి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు మరియు ఆర్జెడి కే విజయభాస్కర్ తదితరులు చేతుల మీదగా విజయనగరంలో హోటల్ లేక్ పాలెస్ లో సత్కరించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ స్టడీస్ టీచర్స్ పోరం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి KV కృష్ణారెడ్డి కూనటి సురేష్ లు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు సాంఘిక శాస్త్రానికిచేసిన సేవలకు గుర్తింపుగా మరియు సామాజిక బాధ్యతతో అనేక కార్యక్రమాలలో పాల్గొని పల్లు కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా దారపురెడ్డి భాస్కరరావు కు ఈ అవార్డు దక్కిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వివిధ జిల్లాల అధ్యక్షులు గుర్రం మురళీ మోహన్ విజయనగరం సాంఘిక శాస్త్ర గౌరవ అధ్యక్షులు వై ఎల్లమ్మ నాయుడు మరియు అధ్యక్షులు సుంకరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు