అట్టహాసంగా యార్లగడ్డ విజయోత్సవ ర్యాలీ
గన్నవరం : వి బి న్యూస్ డిజిటల్ మీడియా
రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో తిరుగులేని విజయం సాధించిన యార్లగడ్డ వెంకట్రావు విజయోత్సవ యాత్ర శనివారం సాయంత్రం అట్టహాసంగా సాగింది. మాజీ ఒక ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం విజయవాడ మండలం రామవరప్పాడు రింగ్ వద్దగల జగజ్జివన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో కార్లు,మోటార్ వాహనాలతో, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు యార్లగడ్డ అభిమానులు పెద్ద సంఖ్య లో తరలిరాగా రామవరప్పాడు రింగ్ వద్ద నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. ఓపెన్ టాప్ వాహనం పై నుండి వెంకట్రవ్ ప్రజలకు అభివాదం చేస్తుండగా భారీ ఎత్తున బాణాసంచా కాల్చి,తారాజువ్వలు వేసిన అభిమానులు యార్లగడ్డ జిందాబాద్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అక్కడి నుండి జాతీయారహదారి పై విజయయాత్ర సాగింది. అక్కడి నుండి ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు తదితర గ్రామాల మీదుగా ర్యాలీ సాగుతుండగా తమ అభిమాన నాయకుడికి గ్రామ గ్రామాన కార్యకర్తలు, ప్రజలు గజమాలలతో వెంకట్రావ్ కు ఘనస్వాగతం పలికారు. జాతీయ రహదారి ర్యాలీ లోని వాహనాలతో కిక్కిరిసి పోయింది. గన్నవరంలో సౌమ్యుడు, విద్యావంతుడు, వినయశీలి అయిన టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ ఘన విజయం సాధించడంతో అటు టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు,అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. దింతో అభిమాన నాయకునికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ర్యాలీకి తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….