సీఎం అయినందుకు కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి సూరపనేని.
బాపులపాడు: విబి న్యూస్ డిజిటల్ మీడియా
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన సూరపునేని రంగారావు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైతే కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానని మొక్కుకున్నాడు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూరపునేని రంగారావు తన మొక్కులు చెల్లించుకోవటానికి ఈరోజు గురువారం తెల్లవారుజామున హనుమాన్ జంక్షన్ లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి కాలినడకన తిరుమల తిరుపతి బయలుదేరాడు.
ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల తెలుగుదేశం అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు పార్టీ నాయకులు సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు