వల్లభనేని వంశీ అరెస్టు రంగం సిద్ధం?
AP : గన్నవరం: వి బి న్యూస్ డిజిటల్ మీడియా
TDP కార్యాలయంపై దాడి కేసులో మాజీ MLA వల్లభనేని వంశీని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వంశీని 71వ నిందితుడిగా పేర్కొనడం జరిగింది. అరెస్టుల భయంతో YCP నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ క్షణంలో అయినా మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.