సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాడ మాస సారే
బాపులపాడు మండలం, రంగయ్య అప్పారావుపేట, వేలేరు మరియు బండారుగూడెం, కానుమోలు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాడ మాస సారె ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 580 మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణాజిల్లా సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 రోజులలో 25 మండలాల్లో 468 గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని అనగా ఇంద్రకీలాద్రి ఇలా ఇతర గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్ బాపులపాడు మండల మహిళ సహా కన్వీనర్ కనకరత్నం తెలిపారు. అందులో భాగంగా రంగయ్య అప్పారావుపేట, వేలేరు మరియు బండారుగూడెం, కానుమోలు రామాలయం నుండి గంగానమ్మ అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందని బాపులపాడు మండల కన్వీనర్ తట్టి సుబ్బారావు తెలియజేశారు. మహిళా కమిటీల సహకారంతో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో “జై దుర్గా” నామస్మరణతో రంగయ్య అప్పారావుపేట, వేలేరు మరియు బండారుగూడెం, కానుమోలు గ్రామాల నుండి గంగానమ్మ అమ్మవారి వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల సహా కన్వినర్ దావులూరి శ్రీహరి, మహిళా కమిటీలు మరియు గన్నవరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ యడవల్లి పాండు రంగారావు, SSF కమిటీ సభ్యులు: బొత్స వెంకటేశ్వరరావు, గ్రామ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.