బాపులపాడు లో ముడుపులు చెల్లిస్తే చాలు ఎవరి భూమి అయినా మీ పేరు మీద ఆన్లైన్ లోకి వస్తుంది!

బాపులపాడు లో ముడుపులు చెల్లిస్తే చాలు ఎవరి భూమి అయినా మీ పేరు మీద ఆన్లైన్ లోకి వస్తుంది!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బాపులపాడు : వి బి న్యూస్ డిజిటల్ మీడియా

కృష్ణాజిల్లా, నూజివీడు కానుమొలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆన్లైన్లో ఉండి ముడుపులు చెల్లిస్తే చాలు ఎలాంటి రిజిస్ట్రేషన్ అయినా చేసేస్తాం!

బాపులపాడు మండలం లోని రెవిన్యూ లో గత నాలుగు సంవత్సరాలగా భారీగా దొంగ పట్టాలా అలా నడిచింది!

పక్కా పట్టా భూమి నీ కూడా మరొకరి పేరు మీదకి భూ యజమాని అనుమతి లేకుండా మార్చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు!

ఇదేమిటి అని గతంలో అడిగిన వారిపై రిపోర్ట్ నేను రాస్తా నువ్వేం అవుతావు జైల్లో కూర్చోవాలి అని స్వయానా ఎమ్మార్వో భూ యాజమాని నీ బెదిరించిన సందర్భాలు కూడా జరిగాయి.!

ముడుపులు చెల్లిస్తే చాలు ఎవరి భూమి అయినా మీ పేరు మీదకు మార్చేస్తా అన్నట్లుగా వ్యవహరించారు!

ఉదాహరణకు కొత్తపల్లి గ్రామంలో సుమారు 45 సెంట్లు మెయిన్ రోడ్డు మీద ఉన్న పట్టా భూమిని అప్పుడు మహానుబావులు ఎవరో గాని భూ యజమాని తో సంబంధం లేకుండా మరొకరి పేరు మీదకి మార్చేసి పాస్ పుస్తకం కూడా ఇచ్చిన ఘనుడు ఉన్నాడు!

రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు భూయాజమానితో సంబంధం లేకుండా మరొకరి పేరు మీదకి మార్చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు!

సబ్ రిజిస్టర్ కార్యాలయం లో రిజిస్ట్రేషన్లు కూడా జరిపారు ఇది ఎలా సాధ్యమైంది..?

రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ముడుపులు చెల్లిస్తే ఎవరి పేరు మీదైనా రిజిస్ట్రేషన్లు చేసేస్తారా…?  భూ యాజుమానితో సంబంధం లేకుండా!

ఇది ఆరోపణలు మాత్రం కాదు కచ్చితంగా నిర్ధారించి చెబుతున్నాం జరిగిన వాస్తవాలు!

ఆధారాలు ఉన్నాయి త్వరలో మొత్తం మీ ముందుకు తీసుకువస్తాం. రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు ఆధారాలతో మీ ముందుకు త్వరలో తీసుకొస్తాం!

గతంలో చేసిన కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన భూమి యాజమాని గుడివాడ ఆర్డిఓ ని సంప్రదించగా తక్షణమే ఎంక్వయిరీ వేసి ఆ రైతుకు భూమిని ఆ రైతు పేరు మీదకు ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేశారు!

గుడివాడ ఆర్డిఓ వారు ఇలాంటి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని మీ దగ్గరకు వచ్చిన రైతులకు న్యాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు!

అసలు ఇవి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు పక్కా పట్టా భూమిని మార్చేశారంటే చర్యలు తీసుకోరా లేదా వేచి చూడాలి!

ప్రస్తుతం ఇలాంటి సమస్యతో మల్లవల్లి భూమికి సంబంధించిన ఒక రైతు ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఇంకా న్యాయం జరగని పరిస్థితి!

కోర్టు నుంచి ఈ భూమి ఆర్డర్ ఇచ్చినా కూడా పట్టించుకోని అధికారులు!

ఇదేమిటి రిజిస్ట్రేషన్ ఎలా చేశారని అడిగితే ఆన్లైన్లో ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటున్న రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది!

ఇలాంటివి రెవెన్యూ లో భూ యజమాని అనుమతి లేకుండా మార్చేసినవి ఎన్ని ఉన్నాయో, నూజివీడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇలాంటి  రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో. ఇవన్నీ బయటపడాలంటే పూర్తి ఎంక్వయిరీ వేసి గతంలో జరిగిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్ని మార్పిడిలు ఎంతమంది రైతులు నష్టపోయారు వాటిపై అప్పుడు ఈ విధంగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామ రైతులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *